నగరంలోని మియాపూర్, మార్తాండోనగర్‌లో షరాఫత్(24) అనే యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు.
మియాపూర్‌లో యువకుడి దారుణ హత్య
Published Fri, Jul 22 2016 2:43 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
హైదరాబాద్: నగరంలోని మియాపూర్, మార్తాండోనగర్‌లో షరాఫత్(24) అనే యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. బతుకుదెరువు నిమిత్తం 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి గోపాలపురంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ గ్లాస్‌ఫిట్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే షరాఫత్‌కు వివాహం నిశ్చయమైంది. షరాఫత్‌తో వివాహం కుదిరిన అమ్మాయిని వేరొక వ్యక్తి ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తికి ఈ వివాహం ఇష్టంలేకే షరాఫత్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మద్యాహ్నం ఒంటి గంట సమయంలో షరాఫత్‌ను బండరాయితో మోది హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement