సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో గుండె ఆగింది. భవిష్యత్‌పై బెంగతో మియాపూర్-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేసే ఎరుకాల లక్ష్మయ్య గౌడ్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లక్ష్మయ్య మృతికి నిరసనగా కార్మికులు మియాపూర్ డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడు నల్గొండ జిల్లాలోని మర్రిగూడవాసిగా తెలిసింది. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 12 వరోజుకు చేరింది.
(చదవండి : చర్చించుకోండి!)
ఇదిలాఉండగా.. ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. రాణిగంజ్ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సురేందర్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌సీయూ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సందీప్ బ్లేడ్‌తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు.ఈక్రమంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment