హైదరాబాద్: నగరంలో గుర్తుతెలియని దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. గురువారం అర్థరాత్రి దుండగులు ఏటీఎం మిషన్ తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించక పోవడంతో దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మియాపూర్ స్వర్ణపురి కాలనీలోని బస్టాప్ వద్ద ఎస్‌బీహెచ్ ఏటీఎంలో జరిగింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ కెమరాల ఫూటేజి ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.