నగరంలోని మియాపూర్ లేక్‌వేవ్ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది.
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లేక్‌వేవ్ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్లోలోని ఓ ఫ్లాట్ తాళాలు పగులగొట్టిన దొంగలు ఇంట్లో ఉన్న 60 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులను అపహరించుకెళ్లారు.
అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ప్రభావతి, ఆమె కుమారుడు అమర్‌నాథ్ వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు అదే అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లి పడుకుంది. ఇదే అదునుగా భావించిన దుండగులు తాళాలు పగులగొట్టి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. గురువారం ఉదయం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.