
సినీ నటి లిఖిత
మియాపూర్: సినీ నటి లిఖిత సిటీలో సందడి చేసింది. స్లీప్‌వెల్ ఇండియా మియాపూర్‌లోని ఆల్విన్ చౌరస్తాలో నెలకొల్పిన 33వ షోరూమ్ ఫ్యుజన్ ఫర్నీచర్ స్లీప్‌వెల్ వరల్డ్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. సరైన నిద్రతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు అమిత్‌పటేల్, విమల్‌పటేల్, షోరూం నిర్వాహకులు భూషణ్‌పాఠక్, జయం శ్రీనివాస్ పాల్గొన్నారు.