మియాపూర్-శంషాబాద్ మార్గంలో ఏసీ బస్సులు | AC Buses available in Miyapur to Shamshabad route | Sakshi
Sakshi News home page

మియాపూర్-శంషాబాద్ మార్గంలో ఏసీ బస్సులు

Published Mon, Nov 2 2015 6:10 PM | Last Updated on Tue, Oct 30 2018 4:05 PM

AC Buses available in Miyapur to Shamshabad route

మియాపూర్ (హైదరాబాద్) : మియాపూర్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు మియాపూర్ డిపో -2 మేనేజర్ బి.వెంకారెడ్డి సోమవారం తెలిపారు. గంటకు ఒకటి చొప్పున ప్రతిరోజూ 48 ట్రిప్పులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ బస్సు సర్వీసులు పటాన్‌చెరువు, రాంచంద్రాపురం, చందానగర్, మియాపూర్ ఆల్విన్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. మియాపూర్ నుంచి శంషాబాద్‌కు బస్సు చార్జీ రూ.250 గా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement