విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసెలు అగ్నికి ఆహుతై దాదాపు రూ.4లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
మియాపూర్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసెలు అగ్నికి ఆహుతై దాదాపు రూ.4లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని అపార్ట్‌మెంట్ల సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గిరి, గుణ, శ్రీను, రాముల కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు సిద్ధమైన వారంతా కొంత నగదు, దుస్తులు, నగలు సిద్ధంగా ఉంచుకుని సోమవారం ఉదయం పనులకు వెళ్లిపోయారు.
కాగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు గుడిసెలు కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తామంతా కట్టుబట్టలతో మిగిలామని.. రూ.4 లక్షల మేర ఆస్తినష్టం సంభవించిందని బాధితులు వాపోతున్నారు.