సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేమ్ ఆడుకునేందుకు మొబైల్ ఇవ్వలేదని 12 ఏళ్ల బాలుడు అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మియాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బాలవెంకట్ సత్య ప్రసాద్(12) అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి మియాపూర్‌లోని స్వప్న నిర్వాన్ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ట్యాబ్‌లో గేమ్ ఆడుకునేందుకు తండ్రి నిరాకరించాడన్న మనస్థాపంతో అపార్టుమెంట్‌పై నుంచి దూకి మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక ఇటీవల కాలంలో చిన్నారులపై సెల్‌ఫోన్‌లు, గేమ్‌ల ప్రభావం ఎంతగా ఉందో మరోసారి ఈ తాజా ఘటనతో రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment