ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య | Girl commits suicide in Miyapur over love issues | Sakshi
Sakshi News home page

ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

May 4 2019 6:03 PM | Updated on May 4 2019 6:47 PM

Girl commits suicide in Miyapur over love issues - Sakshi

వసుంధర అనే మరో మహిళ మహేశ్వరిని వేధించడంతో

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లింగానాయక్‌ సమాచారం మేరకు... వైజాగ్‌ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్‌లోని సిన సెంట్రీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్‌ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. 

దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్‌లోని ఐదవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్‌ ఆల్విన్‌కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌ రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement