సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప‍్రకటన చేశారు.
జేఎస్‌ఆర్ గ్రూప్ సన్‌సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు.
అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment