హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హఫీజ్‌పేట్ ప్రేమ్ నగర్ శివారు ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయస్సు 30 ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మియాపూర్‌లో దారుణం
Published Fri, Mar 10 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
Advertisement
Advertisement