మియాపూర్: అప్పుగా తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్‌ను దారుణంగా హతమార్చి అతడి తలను ఒకచోట, మొండాన్ని మరొక చోట పడేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన నగరంలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా, గూడూరు మండలం తీగెలపాడుకు చెందిన గడ్డం ప్రవీణ్(25) అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. ఎంఏనగర్‌లో నివాసముంటున్న ఏపీకి చెం దిన బావాబామ్మర్దులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లు మియాపూర్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు చిన్న మొత్తాల్లో ఫైనాన్స్‌లు ఇస్తుంటారు.
ఈ క్రమంలో శ్రీవాణినగర్‌లో ఉండే తాడేపల్లిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ రాజేశ్‌కు రూ.15 వేలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు సకాలం లో తిరిగి ఇవ్వక పోవడంతో ప్రవీణ్‌తో కలసి శ్రీకాంత్, శ్రీనివాస్‌లు గురువారం రాత్రి 12 సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి అతడిని, ఆటో బయటకు తీసుకెళ్లారు. ఆటోలోనే రాజేశ్‌ను కొట్టుకుంటూ దీప్తిశ్రీనగర్‌లోని ధర్మ పురి క్షేత్రం సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ యాదవ్ తన వెంట తెచ్చుకున్న చున్నీని అనూహ్యంగా ప్రవీణ్ మెడకు చుట్టాడు. ఆ వెంటనే శ్రీకాంత్ యాదవ్ కత్తితో ప్రవీణ్‌పై దాడి చేశాడు.
ప్రవీణ్‌పై దాడిని పసిగట్టిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయి మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్, శ్రీనివాస్‌లిద్దరూ తనపై దాడి చేశారని, ప్రవీణ్‌ను హత్య చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు ప్రవీణ్ మొండెం మాత్రమే లభించింది. ఉద యం మియాపూర్ లోని ట్రాఫిక్ పీఎస్ ముందు బొల్లారం క్రాస్‌రోడ్డులో గుర్తు తెలియని తలపడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తల, మొండెం స్వాధీ నం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, మియాపూర్ ఏసీపీ రవి కుమార్ పరిశీలించారు.
పాతకక్షలే కారణమా?
అమీన్‌పూర్‌లో ఉండే ఓ బిల్డర్‌కు శ్రీకాంత్ యాదవ్‌కు మధ్య గతంలో గొడవ జరిగింది. దీంతో ఆ బిల్డర్ శ్రీకాంత్‌యాదవ్‌పై కేసు పెట్టాడు. స్నేహితుడైన ప్రవీణ్ ఆ బిల్డర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని తనపై దాడి చేసే అవకాశం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజేష్‌తో గొడవ పడినట్లుగా నటించి బావమరిదితో కలసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment