Auto driver murder
-
తల ఒకచోట.. మొండెం మరోచోట
మియాపూర్: అప్పుగా తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్‌ను దారుణంగా హతమార్చి అతడి తలను ఒకచోట, మొండాన్ని మరొక చోట పడేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన నగరంలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా, గూడూరు మండలం తీగెలపాడుకు చెందిన గడ్డం ప్రవీణ్(25) అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. ఎంఏనగర్‌లో నివాసముంటున్న ఏపీకి చెం దిన బావాబామ్మర్దులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లు మియాపూర్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు చిన్న మొత్తాల్లో ఫైనాన్స్‌లు ఇస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవాణినగర్‌లో ఉండే తాడేపల్లిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ రాజేశ్‌కు రూ.15 వేలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు సకాలం లో తిరిగి ఇవ్వక పోవడంతో ప్రవీణ్‌తో కలసి శ్రీకాంత్, శ్రీనివాస్‌లు గురువారం రాత్రి 12 సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి అతడిని, ఆటో బయటకు తీసుకెళ్లారు. ఆటోలోనే రాజేశ్‌ను కొట్టుకుంటూ దీప్తిశ్రీనగర్‌లోని ధర్మ పురి క్షేత్రం సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ యాదవ్ తన వెంట తెచ్చుకున్న చున్నీని అనూహ్యంగా ప్రవీణ్ మెడకు చుట్టాడు. ఆ వెంటనే శ్రీకాంత్ యాదవ్ కత్తితో ప్రవీణ్‌పై దాడి చేశాడు. ప్రవీణ్‌పై దాడిని పసిగట్టిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయి మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్, శ్రీనివాస్‌లిద్దరూ తనపై దాడి చేశారని, ప్రవీణ్‌ను హత్య చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు ప్రవీణ్ మొండెం మాత్రమే లభించింది. ఉద యం మియాపూర్ లోని ట్రాఫిక్ పీఎస్ ముందు బొల్లారం క్రాస్‌రోడ్డులో గుర్తు తెలియని తలపడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తల, మొండెం స్వాధీ నం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, మియాపూర్ ఏసీపీ రవి కుమార్ పరిశీలించారు. పాతకక్షలే కారణమా? అమీన్పూర్లో ఉండే ఓ బిల్డర్‌కు శ్రీకాంత్ యాదవ్‌కు మధ్య గతంలో గొడవ జరిగింది. దీంతో ఆ బిల్డర్ శ్రీకాంత్‌యాదవ్‌పై కేసు పెట్టాడు. స్నేహితుడైన ప్రవీణ్ ఆ బిల్డర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని తనపై దాడి చేసే అవకాశం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజేష్‌తో గొడవ పడినట్లుగా నటించి బావమరిదితో కలసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆటో డ్రైవర్ దారుణ హత్య
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎప్పటిలాగే ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి 104 ఏరియా ప్రధాన రహదారి నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో అప్పటికే కాపుకాసిన ఇద్దరు దుండగులు వెనుక నుంచి వచ్చి బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. వెంబడించి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో హతాశులైన స్థానికులు వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గాయాలతో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. 104 ఏరియాలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కొప్పర నటరాజు(35) మూడు నెలల కిందట 104 ఏరియా బాపూజీనగర్ సమీప వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో 104 ఏరియా ప్రధాన రహదారి నుంచి బాపూజీనగర్ సమీపంలోని తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. వీధిలోకి రావడం గమనించిన దుండగులు వెనుక నుంచి వెంబడించారు. వెంట తెచ్చుకున్న బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. తల వెనుక భాగంలో, మెడ, కడుపుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. పరుగెడుతూ వచ్చి ఇంటి సమీపంలో అచేతనంగా నటరాజు పడిపోయాడు. దీంతో దుండగులు పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు తెలియజేశారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ మళ్ల శేషు, ఎస్ఐలు నర్సింగరాజు, నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరశీలించి వివరాలు సేకరించారు. గాయాలతో ఉన్న నటరాజును కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు పిల్లలున్నారు. క్లూస్ టీమ్ సభ్యులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. జాగిలం ఘటనా స్థలం వద్ద చుట్టూ తిరిగి బీఆర్టీఎస్ రహదారి వైపు పరుగులు తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఆటోడ్రైవర్ దారుణ హత్య
కర్నూలు : స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ సందులో శుక్రవారం ఆటోడ్రైవర్ మహేష్ (28)ను దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం రత్నపల్లెకు చెందిన మహేష్ తండ్రి హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కర్నూలుకు వలస వచ్చారు. పి.వి.నరసింహారావు నగర్లో తండ్రి, టీవీ9 ప్రజానగర్ కాలనీలో మహేష్ ఉండేవారు. మహేష్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య హైమావతికి ఇద్దరు కుమార్తెలున్నారు. మగ సంతానం కోసం మేరీని వివాహం చేసుకోవడంతో ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. నగరానికి చెందిన ఆటోడ్రైవర్లు బాబు, ఖాలీషాతో కలసి గురువారం రాత్రి నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని రోహిత్ వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్లో మద్యం సేవిస్తున్న వారితో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం దుకాణంలో నుంచి మహేష్ బయటకు వచ్చిన తర్వాత భరత్ అనే వ్యక్తి మరికొంతమంది స్నేహితులను పిలిపించి దేవీ ఫంక్షన్ హాల్ సందులోకి తీసుకెళ్లి ఇనుప రాడ్లతో బాది పారిపోయారు. స్థానికులు మహేష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం ఉదయం బంధువులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. కోలుకోలేక మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో మద్యం దుకాణంతో పాటు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఆటో డ్రైవర్ దారుణ హత్య
రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణం అరుంధతివాడకు చెందిన ఆటో డ్రైవర్ బుడంగుంట వెంకటరమణ(38)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతుని భార్య చంద్రమ్మ కథనం మేరకు.. వెంకటరమణ ప్రతి రోజు ఆటోను నడిపి వచ్చిన డబ్బును ఇంట్లో ఇచ్చేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట కోడూరు నుంచి చిట్వేలికి బాడుగకు వెళ్లేవాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేవాడు. అలాగే సోమవారం రాత్రి కూడా ఇంటికి రాకపోవడ ంతో చిట్వేలికి బాడుగకు వెళ్లి ఉంటాడనుకుంది. అయితే మంగళవారం ఉదయం కోడూరు మండలం ఓ. కొత్తపల్లె, రామాపురం వడ్డిపల్లె మధ్యలో ఉన్న బ్రిడ్జి ఆటో(ఏపీ04 టీయూ 1266) ఉండగా, అక్కడికి వంద మీటర్ల దూరంలో రమణ మృతదేహం పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోయడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగెత్తుకొంటూ వచ్చి సమీపంలోని పొలంలో పడిపోయాడా.. లేక ఇక్కడే అతన్ని హతమార్చారా అనేది తెలియడం లేదు. దుండగులు ఆటోను వదిలేసి కేవలం డ్రైవర్‌ను మాత్రమే హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతునికి భార్యతో పాటు మహేంద్ర, సంధ్య, వైశాలి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజంపేట డీఎస్పీ అరవింద్‌బాబు, సీఐ మహమ్మద్ రియాజ్, ఎస్ఐ రమేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం పెద్ద దిక్కు హత్యకు గురికావడంతో ఇక తమకు దిక్కెవరంటూ మృతుని భార్య చంద్రమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘర్షణ నివారించబోతే హత్య చేశారు!
విశాఖపట్నం: పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లు, మంచికి పోతే చెడు ఎదురైనట్లు రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ కిరాతకులు సర్ధిచెప్పడానికి వచ్చిన వ్యక్తినే హత్య చేశారు. పాయకరావుపేట మండలం రామభద్రపురంలో ఈ దారుణం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రామభద్రపురంలో రెండు వర్గాలకు చెందిన వారు ఘర్షణపడుతున్నారు. ఆ ఘర్షణ నివారించేందుకు ఆటోడ్రైవర్ సత్తిబాబు ప్రయత్నించాడు. వారికి సర్ధిచెప్పబోయాడు. వారు అతనిని కత్తులతో పొడిచి హత్య చేశారు. **