ఆటో డ్రైవర్ దారుణ హత్య | Auto driver brutal murder | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ దారుణ హత్య

Published Wed, Jul 15 2015 2:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

ఆటో డ్రైవర్ దారుణ హత్య - Sakshi

ఆటో డ్రైవర్ దారుణ హత్య

రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణం అరుంధతివాడకు చెందిన ఆటో డ్రైవర్ బుడంగుంట వెంకటరమణ(38)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతుని భార్య చంద్రమ్మ కథనం మేరకు.. వెంకటరమణ ప్రతి రోజు ఆటోను నడిపి వచ్చిన డబ్బును ఇంట్లో ఇచ్చేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట కోడూరు నుంచి చిట్వేలికి బాడుగకు వెళ్లేవాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేవాడు. అలాగే సోమవారం రాత్రి కూడా ఇంటికి రాకపోవడ ంతో చిట్వేలికి బాడుగకు వెళ్లి ఉంటాడనుకుంది.

అయితే మంగళవారం ఉదయం  కోడూరు మండలం ఓ. కొత్తపల్లె, రామాపురం వడ్డిపల్లె మధ్యలో ఉన్న బ్రిడ్జి ఆటో(ఏపీ04 టీయూ 1266) ఉండగా, అక్కడికి వంద మీటర్ల దూరంలో రమణ మృతదేహం పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోయడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగెత్తుకొంటూ వచ్చి సమీపంలోని పొలంలో పడిపోయాడా.. లేక ఇక్కడే అతన్ని హతమార్చారా అనేది తెలియడం లేదు. దుండగులు ఆటోను వదిలేసి కేవలం డ్రైవర్‌ను మాత్రమే హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మృతునికి భార్యతో పాటు మహేంద్ర, సంధ్య, వైశాలి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజంపేట డీఎస్పీ అరవింద్‌బాబు, సీఐ మహమ్మద్ రియాజ్, ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం పెద్ద దిక్కు హత్యకు గురికావడంతో ఇక తమకు దిక్కెవరంటూ మృతుని భార్య చంద్రమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement