సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు ఆదివారం అర్ధరాత్రి భారీ దోపిడీ చేశారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యాపారి నుంచి 19 కిలోల బంగారం అపహరించుకుపోయారు. దోపిడీ విషయం గుర్తించిన బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులకు కేసును బదిలీ చేశారు. ధర్మవరం పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి. దోపిడీ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment