కుర్లా ఎక్స్ప్రెస్లో దోపిడి
అనంతపురం: లోకమాన్యతిలక్ - చెన్నైస్పెషల్ రైలు కుర్లా ఎక్స్ప్రెస్లో మంగళవారం తెల్లవారుజామున దోపిడి జరిగింది. ముంబాయి నుంచి రేణిగుంటకు ప్రయాణిస్తున్న లీలావతి పటేల్ అనే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి దుండగులు ఐదున్నర తులాల బంగారం, రూ. 25 వేల నగదు దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం ముంబాయి నుంచి బయలుదేరిన రైలు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రాయ్చూర్వాడి సెక్షన్ పరిధిలోని మత్మారి స్టేషన్ వద్దకు చేరింది. సరిగ్గా అదే సమయంలో రైలులో ఉన్న కొందరు వ్యక్తులు చైన్ లాగి ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి వద్దనుంచి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు బాధితులు మంగళవారం గుంతకల్ రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేప్టటారు.