ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పట్టపగలే భారీ దోపిడి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే బ్రహ్మరెడ్డి ఇంటికి బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు.. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను కట్టేసి, వారిపై దాడి చేసి చోరీ పాల్పడ్డారు.
సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల నగదు, 20 కాసుల బంగారు నగలను దుండుగులు ఎత్తుకు పోయినట్టు సమాచారం. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భారీ చోరీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.