తిరుపతిలో భారీ చోరీ | huge robbery in tirupathi | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భారీ చోరీ

Published Fri, May 15 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

తిరుపతిలో భారీ చోరీ

తిరుపతిలో భారీ చోరీ

తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి లో భారీ చోరి జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ. 15 లక్షల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం, శివజ్యోతినగర్‌లో జరిగింది. వివరాలు.. శివజ్యోతినగర్‌కు చెందిన రవిశంకర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు పడి రూ. 5లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు, రెండు విలువైన సెల్‌ఫోన్లు, క్రెడిట్ కార్డులను ఎత్తుకెళ్లారు. ఉదయాన్ని దొంగలు పడిన విషయాన్ని  ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్ స్వ్కాడ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement