నిద్ర లేచేసరికి ఇల్లు గుల్ల | Log in humans during sleep, while the robbers entered the house | Sakshi
Sakshi News home page

నిద్ర లేచేసరికి ఇల్లు గుల్ల

Published Thu, Nov 7 2013 4:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Log in humans during sleep, while the robbers entered the house

 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇంటి యజ మానులు నిద్రలో ఉండగా లోనికి ప్రవేశించిన దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. విశాలమైన ఇంట్లోని ఓ గదిలో నిద్రపోతున్న బాధితులు దొంగల అలికిడిని గమనించలేకపోయారు. ఇదే అదనుగా దుండగులు 121 సవర్ల బం గారు నగలు, ఐదు కిలోల వెండి వస్తువులు, రూ.5.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ సూళ్లూరుపేటలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. షార్‌బస్టాండ్ సమీపంలో సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ సోదరుడు ఎన్ వీ మురళి నివాసం ఉంటున్నారు.
 
 విశాలమైన ఇంట్లోని ఓ గదిలో మురళీ దంపతులు నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. గది తలుపులు పగలగొట్టి సొమ్మంతా ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం నిద్రలేచిన మురళి దొంగలు పడినట్లు గమనించి సొత్తు ఉన్న గదిని పరిశీలించాడు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

'సీఐ ఎం.రత్తయ్య, ఎస్సై బి.అంకమరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాగిలం ఇంటి చుట్టూ తిరిగి వెనక వీధిలో కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. పోలీసులు దొంగల కోసం ఆరా తీస్తున్నారు.  చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాల విలువ రూ.10.72 లక్షలని పోలీ సులు నిర్ధారించగా, ప్రస్తుత రేట్లతో పోలిస్తే సుమారు రూ.34 లక్షలు ఉం టుందని తెలిసింది. భారీ చోరీతో సూళ్లూరుపేట వాసులు హడలిపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement