ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు.
హయత్‌నగర్ (హైదరాబాద్) : ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్‌కుమార్ బొలేరో వాహనం (ఏపీ05 పీఏ 6985)లో సుమారు 256 కిలోల గంజాయిని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన జాదవ్ కాశీరామ్‌కు విక్రయించేందుకు తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో శనివారం రాత్రి పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన (125 ప్యాకెట్లు) గంజాయి రవాణా వెలుగు చూసింది. లక్ష్మణ్‌కుమార్‌తో పాటు కాశీరామ్, విజయనగరంకు చెందిన డ్రైవర్ కె.రమేష్‌లను అరెస్ట్ చేశారు.