హైదరాబాద్: హయత్ నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ వద్ద శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు అవగా, మరో ముగ్గురు ప్రయాణీకులు స్వల్ప గాయాలపాలయ్యారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.