ఎటువంటి చర్యలు తీసుకుంటున్న ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదు.
హైదరాబాద్ : ఎటువంటి చర్యలు తీసుకుంటున్న ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై అధికారులు కొరడా ఘళిపించారు. తాజాగా గురువారం వేర్వేరు ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నగరంలోని హయత్ నగర్ లో అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, అధిక లోడ్ తో వెళ్తున్న 9 లారీలను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆయా లారీల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.