వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని శామీర్‌పేట్ తహాసీల్దార్ దేవుజా పేర్కొన్నారు.
శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా): వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని శామీర్‌పేట్ తహాసీల్దార్ దేవుజా పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేసి తరలిస్తున్న నాలుగు లారీలను శామీర్‌పేట్ రెవెన్యూ అధికారుల పట్టుకుని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో వాల్టా చట్టానికి విరుద్ధంగా మట్టి, ఇసుక తరలిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. లక్ష్మాపూర్‌కు చెందిన రెండు లారీలు, జగన్‌గూడకు చెందిన ఒక లారీ, బొమ్మరాశిపేట్‌కు చెందిన ఒక లారీని అధికారులు పట్టుకున్నారు.