ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Fri, Feb 10 2017 2:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
మేడ్చల్: ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ కూతురు అపూర్వ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement