మండలంలోని గొబ్బరంపల్లి గ్రామానికి చెందిన ఎం.అంజినప్ప కూతురు అఖిల(17) అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమయింది.
రొద్దం : మండలంలోని గొబ్బరంపల్లి గ్రామానికి చెందిన ఎం.అంజినప్ప కూతురు అఖిల(17) అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమయింది. ఈమేరకు బాలిక తండ్రి ఆదివారం ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహులు తెలిపారు. బాలిక హిందూపురంలో ఇంటర్ చదువుతునట్లు తెలపారు. ఈనెల 20న గ్రామంలో బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదన్నారు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో.. కూతురు ఆచూకీ తెలపాలని ఫిర్యాదు చేశారన్నారు.