
విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం!
హైదరాబాద్: నగరంలో మరో కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి సంజయ్ కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బాలాపూర్ లో చోటుచేసుకుంది. కిందకి దూకడంతో సంజయ్ తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. లెక్చరర్ల వేధింపులే తమ కుమారుడి ఆత్మహత‍్యాయత్నానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.