'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
సాక్షి, హైదరాబాద్ : సాయికిరణ్ రెడ్డి ప్లేబాయ్ అయ్యుండొచ్చునని, ఆరు నెలలకో అమ్మాయిని మార్చేవాడు కావొచ్చని దారుణ హత్య గురైన చాందిని తల్లిదండ్రులు ఆరోపించారు. బహుశా తన కూతురితో ఎట్రాక్షన్ లాంటి రిలేషన్ ఏర్పడి అతడి పనులకు తమ కూతురు అడ్డును తొలగించుకోవాలనే ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చాందిని తల్లి చెప్పారు. చాందిని, సాయికిరణ్ రెడ్డి సిల్వర్ ఓక్స్ స్కూళ్లో చదువుకున్నారు. కానీ ఇద్దరు వేరే సెక్షన్లు. అదే సంస్థలో చాందని ఇంటర్ చదువుతుండగా.. సాయికిరణ్ ఎక్కడ చదువుతున్నాడో.. వీరిమధ్య ఏం ఉందో మాకు మాత్రం తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్లాన్ ప్రకారమే చాందిని హత్య
సాయికిరణ్ మంచివాడని అనుకున్నాం, కానీ అతడు ఇంత దారుణానికి పాల్పడుతాడని మేం ఎవరం ఊహించలేదు. మీడియాలో చూసేవరకూ ఈ హత్య చేసిందన్నది మాకు కూడా తెలియదు. సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు. చాందినితో పాటు మరికొందరు అమ్మాయిల్ని వేధించి ఉంటాడు. అసలు ఏమైందో తెలియదు కానీ.. ఎందుకో తనకు అడ్డుగా ఉందని భావించిన సాయికిరణ్.. మరి కొందరు అబ్బాయిలతో కలిసి ప్లాన్‌చేసి చాందినిని హత్యచేశారు. సాయికిరణ్ గురించి తమకు స్పెషల్‌గా ఎప్పుడు చెప్పలేదు. అతడితో పాటు ఫ్రెండ్స్ గురించి చాలా క్యాజువల్‌గా చెప్పేది. టీనేజ్‌లో ఉన్న వీరిమధ్య అట్రాక్షన్ ఉండటం సహజమే. కానీ సాయికిరణ్‌ను ప్రేమిస్తున్నట్లు నా కూతురు చాందిని ఎప్పుడూ చెప్పలేదు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి.
మియాపూర్ కు చెందిన చాందిని జైన్ దారుణహత్య కేసును కేసును పోలీసులు ఛేదించారు. చాందిని స్కూల్‌మేట్ సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మదీనాగూడలోని అపార్ట్‌మెంట్లో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.