Saikiran reddy
-
విమానం ఎక్కాక ఫోన్.. తర్వాత చేస్తే స్విచ్ ఆఫ్.. జాడ లేని ఆర్మీ జవాన్
చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌రెడ్డి పంజాబ్‌లో ఆర్మీ జవాన్ (గన్నర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చిన ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు ఈ నెల 5న ఇంటి నుంచి బయలుదేరాడు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత అతను కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా వారు సాయికిరణ్ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై పంజాబ్‌లోని ఆర్మీ అధికారులకు ఫోన్ చేయగా అతను విధుల్లో చేరలేదని చెప్పినట్లు కిరణ్ తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం సహకరించాలని వారు పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు. సాయికిరణ్ కనిపించకుండా పోవడంపై గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్లో సమాచారం ఇచ్చాడు. దీంతో పాటు సాయికిరణ్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాయికిరణ్ కనిపించకుండా పోయిన సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్కడే కేసు నమోదైనట్లు వివరించారు. -
స్నేహితుడే హంతకుడు
♦ మరో ఇద్దరితో సన్నిహితంగా ఉండటంతో చాందినిని హతమార్చిన క్లాస్మేట్ ♦ అమీన్పూర్ గుట్టపైకి రమ్మని పిలిచి.. గొంతు నులిమి హత్య ♦ ఆపై గుట్టపై నుంచి కిందకు తోసివేత ♦ మృతురాలి సెల్‌ఫోన్ చెరువులో పడేసి పరారీ ♦ సీసీటీవీ ఫుటేజీ, ఆటోడ్రైవర్ సాయంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. క్లాస్మేటే కాలాంతకుడయ్యాడు. తనతో గాకుండా మరో ఇద్దరితో స్నేహంగా ఉండటాన్ని భరించలేక పథకం ప్రకారం హత్య చేశాడు. మాట్లాడదామని నమ్మబలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మాయి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గుట్టపై నుంచి కిందకు తోసేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఠాణా పరిధిలో చాందిని జైన్ మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బుధవారం ఈ కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌తో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. పదో తరగతి దాకా కలిసి చదువు సిల్వర్ ఓక్స్ స్కూల్లో చాందిని జైన్, నిందితుడు(మైనర్) పదో తరగతి వరకు చదివారు. ఆ సమయంలో వీరి మధ్య చిగురించిన స్నేహం బలపడింది. తర్వాత చాందిని ఈ స్కూల్లోనే చదువు కొనసాగించగా.. నిందితుడు డీఆర్ఎస్ కాలేజీలో చేరి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఫేస్బుక్లో ఓ పేజీ(నేషనల్ డిప్లొమోస్ సమ్మిట్) క్రియేట్ చేసి అందులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను సభ్యులుగా చేర్చాడు. ఇలా ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా మారిన వీరంతా సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్లో కలిశారు. ఈ పార్టీకి చాందిని జైన్‌తోపాటు ఆమె స్నేహితుడు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చాందిని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. అప్పట్నుంచి ఆమెకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్తున్నట్టు ఈ నెల 9న చాందిని నిందితుడికి చాటింగ్ ద్వారా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. మాట్లాడుకుందాం రమ్మం టూ చాందినిని పిలిచాడు. సాయంత్రం ఐదు గంటలకు దీప్తిశ్రీ నగర్ క్రాస్ రోడ్స్‌కు వచ్చి చాందినితో కలిసి ఆటోలో అమీన్పూర్ గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. స్నేహం ఎప్పట్లాగే కొనసాగించాలని చాందిని ఒత్తిడి తెచ్చింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో నిందితుడు చాందిని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తర్వాత గొంతు నులిమి చంపి గుట్టపై నుంచి 10 మీటర్ల కిందకు పడేశాడు. అనంతరం మృతురాలి సెల్‌ను చెరువులో పడేసి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కాడిలా.. అమీన్‌పూర్‌లోని మాధవీపూరి హిల్స్ వద్ద ఓ సీసీటీవీలో నిందితుడు ముఖానికి గుడ్డ కట్టుకున్న దృశ్యాలు చిక్కాయి. చాందినితో కలసి ఆటోలో దిగి గుట్టల వైపు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అతడి ద్వారా వివరాలు సేకరించారు. అప్పటికే సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుడు మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను కూడా అతడి ఇంటికి తీసుకెళ్లి ప్రశ్నించారు. చాందిని హత్య జరిగిన 9 తేదీ సాయంత్రం తాను క్రికెట్ ఆడుతున్నట్టు నిందితుడు చెప్పినా.. పోలీసు విచారణలో అబద్ధమని తేలింది. అతడి తండ్రి కూడా సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల్లో ఉన్నది తన కుమారుడేనని తెలపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఓ మైనర్ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి నగరంలోని ఓ హోటల్లో కలవడం, పబ్‌ల్లో మద్యం సేవించడం మామూలు విషయం కాదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. ఫేస్బుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – సందీప్ శాండిల్య, సీపీ నిందితుడిని కఠినంగా శిక్షించాలి స్నేహం పేరుతో దగ్గరై మా కూతుర్ని చంపినవాడిని కఠినంగా శిక్షించాలి. హత్య ఒక్కడే చేశాడంటే మేం నమ్మలేకపోతున్నాం. అతడు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్నేహంగా నటించి హత్య చేశాడు. – కవిత, చాందిని తల్లి -
ముందస్తు ప్రణాళికతోనే చాందిని హత్య
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సందీప్ శాండిల్య ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘ఈ నెల 9న చాందిని ఇంటి నుంచి వెళ్లింది. అదేరోజు సాయంత్రం ఆమె మిస్ అయినట్లు మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు రాగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 11న అమీన్పూర్లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే చాందిని తల్లిదండ్రులను పిలిపించాం. ఆ మృతదేహం చాందినిదేనని వారు నిర్థారించారు. అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవు. చాందినిది కేవలం హత్య మాత్రమే. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్య ఏ సమయంలో జరిగిందో చెప్పగలం. ఫిర్యాదు అందిన సమయానికి ముందే చాందిని హత్యకు గురైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించాం. సీసీ పుటేజ్‌ను చాందిని తండ్రితో పాటు సాయికిరణ్ తండ్రికి చూపించాం. ఫుటేజ్ చూపిన తర్వాత నిందితుడి తండ్రి ఒప్పుకున్నారు. కాల్ డేటా వివరాలతో పాటు, స్నేహితులను విచారణ చేశాం. వారు ఆ సమయంలో ఎక్కడున్నారో ప్రశ్నించారు. అలాగే సాయి కిరణ్‌ను కూడా ప్రశ్నించాం. నిందితుడు మొదట తప్పించుకునేందుకు యత్నించాడు. హత్య జరిగిన సమయంలో తాను క్రికెట్ ఆడినట్లు తెలిపాడు. అయితే మా విచారణలో అతడు అసలు క్రికెట్ ఆడలేదని తేలింది. దీంతో అతడు అబద్ధం చెప్పాడని తేలిపోయింది. సాయికిరణ్ రెండు నెలల క్రితమే హత్య జరిగిన అడ్డగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వచ్చాడు. చాందిని, నిందితుడు ఇద్దరూ ఆటోలో అక్కడకు వెళ్లారు. చాందిని స్నేహితులు ఎక్కువ. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకూ జరిగిన గెట్ టు గెదర్‌లో మరో వ్యక్తితో చాందిని సన్నిహితంగా మెలిగింది. అలాగే 9న సోహైల్ అనే వ్యక్తితో పబ్‌కు వెళ్లాలని చాందిని అనుకుంది. కానీ సాయికిరణ్ పిలవడంతో పబ్‌కు రావడం లేదని సోహైల్‌కు చెప్పింది. ఇక తనతో పాటు మరో ఇద్దరితో చాందిని సన్నిహితంగా ఉండటం సాయికిరణ్‌కు నచ్చలేదు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని చాందిని...అతడిని ఒత్తిడి చేసింది. అయితే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని సాయికిరణ్ చెప్పాడు. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగింది. దీంతో కోపంతో చాందిని చెంప మీద కొట్టి మెడకు చున్నీ బిగించి ఉరి వేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్ట మీద నుంచి కిందకు తోసేశాడు. హత్య చేసిన తర్వాత వేరే దారి నుంచి వెనక్కి వచ్చాడు.’ అని తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. ప్రతిదానికి ఫేస్‌బుక్‌పైనే ఆధారపడుతున్నారని, అంతేకాకుండా సోషల్ మీడియాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఫేస్బుక్లో లైక్స్ తక్కువ వచ్చాయని కూడా బాధపడుతున్నారన్నారు. మృతి చెందిన చాందినితో పాటు సాయి కిరణ్ కూడా మైనరేనని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. -
ముందస్తు ప్రణాళికతోనే చాందిని హత్య
-
'పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్.. ఉరి తీయాలి'
-
'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
-
'పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్.. ఉరి తీయాలి'
హైదరాబాద్ : తమ కూతురుని పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని చాందినీ తండ్రి నగరంలో సంచలనం సృష్టించిన కిషోర్ జైన్ అన్నారు. తన కూతురు చాలా బాగా చదివేదని, ఎప్పుడూ కెరీర్ గురించి తనకు చెబుతుండేదని, మంచి ఉద్యోగం సంపాధించి తన కూతురే తన సంరక్షణను చూసుకుంటానని చెప్పేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తొలుత మిస్టరీగా మారిని చాందినీ కేసు కాస్త హత్య కేసుగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. సాయికిరణ్ రెడ్డి అనే ఆమె స్కూల్ స్నేహితుడే ఈ హత్యకు పాల్పడ్డాడని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన చాందినీ కుటుంబం సభ్యులు షాక్‌లోకి వెళ్లారు. క్లోజ్ ఫ్రెండ్ ఇలా చేస్తాడని తాము ఊహించలేదన్నారు. సాయికిరణ్, చాందినీ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ప్రశ్నించగా ఆమె తండ్రి మాట్లాడుతూ 'స్నేహితులు అన్నాకా క్లోజ్‌గా ఉంటారు.. వారు ప్రేమికులని ఎవరూ ఊహించలేరు. మేం కూడా అనుకోలేదు. ఆ విషయం కూడా నాతో చాందినీ చెప్పలేదు. మా పాప బాగా చదువుతుంది. కెరీర్ గురించి చెబుతుంది. ఏం కావాలన్నా నాతో చెబుతుంటుంది. నన్ను బాగా చూసుకుంటానని చెబుతుండేంది. ఇది ప్లాన్ మర్డర్.. పిల్లలు అన్నాక ఎట్రాక్షన్ ఉంటుంది. అని ఇంత దారుణంగా చంపడమంటే పక్కా ప్రీప్లానడ్ మర్డర్. నేను ఆరోజు బ్యాంకాక్ వెళ్లాను బిజినెస్ పనిమీద. ఈ విషయం తెలియగానే వెంటనే వచ్చేశాను. పోలీసులు వారి పని వాళ్లు చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌పై నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది' అని చెప్పారు. చాందినీ సోదరి నివేదిత స్పందిస్తూ ' మా చెల్లెలు సాయికిరణ్ రెడ్డి 6వ తరగతి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వ్యక్తిగతంగా సాయికిరణ్‌ను ఎప్పుడూ కలవేలదు. స్కూల్లో చూశాను. సాయికిరణ్‌కు నా సోదరికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఉంటే ఎట్రాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే మా సోదరి ఎలాంటిదో నాకు తెలుసు. సాయికిరణ్‌రెడ్డిని తను ఎప్పుడైనా బయట కలిశాసిందేమోగానీ, ఇంటికి తీసుకురాలేదు. టెన్త్ అయ్యాక చాందినీ అదే స్కూల్లో చదువుతుంది.. కానీ, సాయికిరణ్ రెడ్డి మాత్రం వేరే కాలేజీకి వెళ్లినట్లు మాత్రమే నాకు తెలుసు. ఏ కాలేజో నాకు తెలియదు. వారిద్దరు కాంటాక్ట్‌లో ఉన్నట్లు కూడా నాకు పెద్దగా తెలియదు. ఆ రోజు ప్రెండ్‌ను కలుస్తున్నా అని చెప్పి వెళ్లింది.. సెక్యూరిటీ కూడా గేటు దాటి వెళ్లేవరకు చూశానని చెప్పాడు. తను వేరే ఫ్రెండ్‌ను మీట్ అవుతున్నా అని చెప్పిందికానీ, సాయికిరణ్ తల్లిదండ్రులు మాకు తెలియదు. వారితో సంబంధం లేదు. మా చెల్లికి టాటూ మేమే వేయించాం. టాటూ అతను ఇంటికి వచ్చే వేశాడు. తను వెరీ డీసెంట్. ఈ కేసులో మరో ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. చాందినీ ఎప్పుడూ పబ్‌కు వెళ్లలేదు. మాకు న్యాయం జరగాలి. వారిని ఉరి తీయాలి' అంటూ ఆవేదనగా చెప్పింది. -
'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
సాక్షి, హైదరాబాద్ : సాయికిరణ్ రెడ్డి ప్లేబాయ్ అయ్యుండొచ్చునని, ఆరు నెలలకో అమ్మాయిని మార్చేవాడు కావొచ్చని దారుణ హత్య గురైన చాందిని తల్లిదండ్రులు ఆరోపించారు. బహుశా తన కూతురితో ఎట్రాక్షన్ లాంటి రిలేషన్ ఏర్పడి అతడి పనులకు తమ కూతురు అడ్డును తొలగించుకోవాలనే ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చాందిని తల్లి చెప్పారు. చాందిని, సాయికిరణ్ రెడ్డి సిల్వర్ ఓక్స్ స్కూళ్లో చదువుకున్నారు. కానీ ఇద్దరు వేరే సెక్షన్లు. అదే సంస్థలో చాందని ఇంటర్ చదువుతుండగా.. సాయికిరణ్ ఎక్కడ చదువుతున్నాడో.. వీరిమధ్య ఏం ఉందో మాకు మాత్రం తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్లాన్ ప్రకారమే చాందిని హత్య సాయికిరణ్ మంచివాడని అనుకున్నాం, కానీ అతడు ఇంత దారుణానికి పాల్పడుతాడని మేం ఎవరం ఊహించలేదు. మీడియాలో చూసేవరకూ ఈ హత్య చేసిందన్నది మాకు కూడా తెలియదు. సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు. చాందినితో పాటు మరికొందరు అమ్మాయిల్ని వేధించి ఉంటాడు. అసలు ఏమైందో తెలియదు కానీ.. ఎందుకో తనకు అడ్డుగా ఉందని భావించిన సాయికిరణ్.. మరి కొందరు అబ్బాయిలతో కలిసి ప్లాన్‌చేసి చాందినిని హత్యచేశారు. సాయికిరణ్ గురించి తమకు స్పెషల్‌గా ఎప్పుడు చెప్పలేదు. అతడితో పాటు ఫ్రెండ్స్ గురించి చాలా క్యాజువల్‌గా చెప్పేది. టీనేజ్‌లో ఉన్న వీరిమధ్య అట్రాక్షన్ ఉండటం సహజమే. కానీ సాయికిరణ్‌ను ప్రేమిస్తున్నట్లు నా కూతురు చాందిని ఎప్పుడూ చెప్పలేదు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. మియాపూర్ కు చెందిన చాందిని జైన్ దారుణహత్య కేసును కేసును పోలీసులు ఛేదించారు. చాందిని స్కూల్‌మేట్ సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మదీనాగూడలోని అపార్ట్మెంట్లో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
చాందిని హత్య: ఊహించని ట్విస్ట్
-
చాందిని కేసును ఛేదించిన పోలీసులు
-
చాందిని కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్‌ను ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నగర పోలీసులు సాయికిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదీనాగూడలోని అపార్ట్మెంట్లో నివాసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన చాందిని సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపించింది. సాయికిరణే ఆమెను ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి చాందిని స్నేహితులను, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా సాయికిరణే ఈ హత్యకు సూత్రధారి అని తేలింది. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
అదే కత్తితో పొడుచుకున్న నిందితుడు కామారెడ్డి: ప్రేమోన్మాదంతో ఓ విద్యార్థి తరగతి గదిలోనే అందరూ చూస్తుండగా తోటి విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహ, మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్‌రెడ్డి కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్ నుంచి ఒకే చోట చదువుతున్న వీరి మధ్య స్నేహం ఉండేది. కానీ, ఇటీవల తనతో కాకుండా ఇతరులతో స్నేహంగా ఉండడాన్ని సాయికిరణ్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడు బుధవారం ఉదయం వెంట తెచ్చుకున్న కత్తితో తరగతి గదిలోనే స్నేహను కత్తితో పొడవగా ఆమె గాయపడింది. మిగతా విద్యార్థులు పట్టుకునేలోగా అదే కత్తితో తన కడుపులో పొడుచుకున్నాడు. కళాశాల అధ్యాపకులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని స్నేహను, సాయికిరణ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. సాయికిరణ్ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. స్నేహ నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, నిందితునిపై 307, 309, 354, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రూరల్ సీఐ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.