ముందస్తు ప‍్రణాళికతోనే ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సందీప్ శాండిల్య ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘ఈ నెల 9న చాందిని ఇంటి నుంచి వెళ్లింది. అదేరోజు సాయంత్రం ఆమె మిస్ అయినట్లు మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు రాగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 11న అమీన్‌పూర్‌లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే చాందిని తల్లిదండ్రులను పిలిపించాం. ఆ మృతదేహం చాందినిదేనని వారు నిర్థారించారు. అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవు.
Published Wed, Sep 13 2017 4:48 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement