'పక్కా ప్రీ ప్లాన్‌డ్ మర్డర్.. ఉరి తీయాలి'
హైదరాబాద్ : తమ కూతురుని పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని చాందినీ తండ్రి నగరంలో సంచలనం సృష్టించిన కిషోర్ జైన్ అన్నారు. తన కూతురు చాలా బాగా చదివేదని, ఎప్పుడూ కెరీర్ గురించి తనకు చెబుతుండేదని, మంచి ఉద్యోగం సంపాధించి తన కూతురే తన సంరక్షణను చూసుకుంటానని చెప్పేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తొలుత మిస్టరీగా మారిని చాందినీ కేసు కాస్త హత్య కేసుగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. సాయికిరణ్ రెడ్డి అనే ఆమె స్కూల్ స్నేహితుడే ఈ హత్యకు పాల్పడ్డాడని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు.
ఈ విషయం తెలిసిన చాందినీ కుటుంబం సభ్యులు షాక్‌లోకి వెళ్లారు. క్లోజ్ ఫ్రెండ్ ఇలా చేస్తాడని తాము ఊహించలేదన్నారు. సాయికిరణ్, చాందినీ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ప్రశ్నించగా ఆమె తండ్రి మాట్లాడుతూ 'స్నేహితులు అన్నాకా క్లోజ్‌గా ఉంటారు.. వారు ప్రేమికులని ఎవరూ ఊహించలేరు. మేం కూడా అనుకోలేదు. ఆ విషయం కూడా నాతో చాందినీ చెప్పలేదు. మా పాప బాగా చదువుతుంది. కెరీర్ గురించి చెబుతుంది. ఏం కావాలన్నా నాతో చెబుతుంటుంది. నన్ను బాగా చూసుకుంటానని చెబుతుండేంది.
ఇది ప్లాన్ మర్డర్.. పిల్లలు అన్నాక ఎట్రాక్షన్ ఉంటుంది. అని ఇంత దారుణంగా చంపడమంటే పక్కా ప్రీప్లానడ్ మర్డర్. నేను ఆరోజు బ్యాంకాక్ వెళ్లాను బిజినెస్ పనిమీద. ఈ విషయం తెలియగానే వెంటనే వచ్చేశాను. పోలీసులు వారి పని వాళ్లు చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌పై నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది' అని చెప్పారు.
చాందినీ సోదరి నివేదిత స్పందిస్తూ ' మా చెల్లెలు సాయికిరణ్ రెడ్డి 6వ తరగతి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను వ్యక్తిగతంగా సాయికిరణ్‌ను ఎప్పుడూ కలవేలదు. స్కూల్‌లో చూశాను. సాయికిరణ్‌కు నా సోదరికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఉంటే ఎట్రాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే మా సోదరి ఎలాంటిదో నాకు తెలుసు. సాయికిరణ్‌రెడ్డిని తను ఎప్పుడైనా బయట కలిశాసిందేమోగానీ, ఇంటికి తీసుకురాలేదు. టెన్త్ అయ్యాక చాందినీ అదే స్కూల్‌లో చదువుతుంది.. కానీ, సాయికిరణ్ రెడ్డి మాత్రం వేరే కాలేజీకి వెళ్లినట్లు మాత్రమే నాకు తెలుసు.
ఏ కాలేజో నాకు తెలియదు. వారిద్దరు కాంటాక్ట్‌లో ఉన్నట్లు కూడా నాకు పెద్దగా తెలియదు. ఆ రోజు ప్రెండ్‌ను కలుస్తున్నా అని చెప్పి వెళ్లింది.. సెక్యూరిటీ కూడా గేటు దాటి వెళ్లేవరకు చూశానని చెప్పాడు. తను వేరే ఫ్రెండ్‌ను మీట్ అవుతున్నా అని చెప్పిందికానీ, సాయికిరణ్ తల్లిదండ్రులు మాకు తెలియదు. వారితో సంబంధం లేదు. మా చెల్లికి టాటూ మేమే వేయించాం. టాటూ అతను ఇంటికి వచ్చే వేశాడు. తను వెరీ డీసెంట్. ఈ కేసులో మరో ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. చాందినీ ఎప్పుడూ పబ్‌కు వెళ్లలేదు. మాకు న్యాయం జరగాలి. వారిని ఉరి తీయాలి' అంటూ ఆవేదనగా చెప్పింది.