
అశ్వారావుపేటరూరల్: ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఇన్‌చార్జి ఎస్సై రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన బాలిక(16) ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కుమార్తె సక్రమంగా చదవడం లేదని ఈ నెల 2న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ తర్వాత పొలానికి వెళ్లిన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా, అతని ఇంటికి వచ్చి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment