
ధర్నా చేస్తున్న లక్ష్మీదేవి
సాక్షి, మిడ్జిల్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీదేవి సోమవారం ఎకనమిక్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరింది. ఆ బస్సు మధ్యలో మొరాయించడంతో (మరమ్మతులకు గురైంది) పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది.
అయితే నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీదేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని అధికారులకు చెప్పినా వినిపించుకోవడంలేదని లక్ష్మీదేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్ నాయక్ ఆమెకి సర్ది చెప్పి పంపించారు.
చదవండి👉🏾పెళ్లైన 4 నెలలకే మరొకరితో ఉంటూ పరువు తీసిందని..
‘ఇంటర్’ మూల్యాంకన పారితోషికం పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని ఇంటర్ బోర్డు 25 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66.. ఇతర విధులకు రోజుకు రూ.641 నుంచి రూ.800 లకు పెంచారు.
చదవండి👇
8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
Comments
Please login to add a commentAdd a comment