
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద గుంటూరు కాలువలో ఇంటర్మీడియట్ విద్యార్థి బి. విద్యాసాగర్(17) గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివీ.. తాడేపల్లి డొల్లాస్ నగర్‌కు చెందిన విద్యాసాగర్ ఆదివారం స్నేహితుతడు జగదీష్ పుట్టిన రోజు కావడంతో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ చినకాకానిలోని గుంటూరు కాలువ వద్దకు సరదాగా వెళ్లాడు. అక్కడ విద్యాసాగర్ ఫోటోలు కోసం కాలువలోకి దిగగా లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు అరుణ్ ప్రమాదంలో చిక్కుకోగా.. అక్కడే ఉన్న అయ్యప్ప మూలధారుల్లో ఒకరు వెంటనే కాలువలోకి దూకి అతడిని కాపాడారు. విద్యాసాగర్ గల్లంతు కావడంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాత్రివేళ విద్యార్థి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment