రాయదుర్గం పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పి.ఇబ్రహీం రెండు రోజులుగా కనిపించడం లేదు.
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పి.ఇబ్రహీం రెండు రోజులుగా కనిపించడం లేదు. బొమ్మనహాళ్ మండలం ఏళంజి గ్రామానికి చెందిన పి.రాజన్న తనయుడు ఇబ్రహీం ప్రతి రోజూ ఉదయం రాయదుర్గానికి వచ్చి కాలేజి అయిపోయిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేవాడు. అయితే సోమవారం కాలేజీకి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. కాలేజీలో విచారణ చేస్తే సోమవారం మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం చుట్టుపక్కల ఊళ్లలోను, బంధువుల ఇళ్లలోను విచారించామన్నారు. దీంతో బుధవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజన్న చెప్పాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ మహానంది తెలిపారు.