Anantapur Suicide News Today: Inter Student Commits Suicide In Anantapur - Sakshi
Sakshi News home page

చెప్పులను కుక్క కొరికేస్తుంది.. పైన పెట్టి వస్తానని భర్తకు చెప్పి వెళ్లి..

Published Tue, Dec 28 2021 7:06 AM | Last Updated on Tue, Dec 28 2021 10:25 AM

Inter Student Commits Suicide In Anantapur - Sakshi

రమ్య (ఫైల్‌)  

అనంతపురం సిటీ: స్థానిక పీటీసీ సమీపంలోని ఫ్లై ఓవర్‌ వద్ద రైలు కింద పడి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని రజక కాలనీకి చెందిన చాకలి రమ్య (18) ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అనివార్య కారణాల వల్ల చిరుప్రాయంలోనే ఆమెను మేనమామ రాముకిచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు.

చదవండి: ఇదివరకే మూడు పెళ్లిళ్లు.. నాలుగేళ్లుగా యువతిని మత్తులో ముంచి అకృత్యం

ఆదివారం రాత్రి ఇరువైపులా కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడిపిన అనంతరం భర్తతో కలిసి ఇంటికి చేరుకుంది. తలుపుల వద్ద వదిలిన చెప్పులను కుక్క కొరికేస్తుందని, పైన పెట్టి వస్తానని భర్తకు తెలిపి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో కుటుంబసభ్యులు గాలిస్తుండగా రైలు పట్టాలపై యువతి మృతదేహం పడి ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికెళ్లి పరిశీలించారు.  మృతదేహం రమ్యదిగా గుర్తించి బోరున విలపించారు. రైలు ఢీకొని ఆమె మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమ్య మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement