సాక్షి, ఖమ్మం: చిన్న వయసులోనే గుండెపోటు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మరణించాడు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మరీదు రాకేష్ మధిరలోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు రాకేష్ మృతి చెందాడు.
కాగా, అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్‌లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్‌నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది.
చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment