ఫలితాలు వచ్చిన మరుసటి రోజే.. | Inter Second Year Student Death | Sakshi
Sakshi News home page

ఫలితాలు వచ్చిన మరుసటి రోజే..

Published Sun, Apr 15 2018 7:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Inter  Second  Year Student Death  - Sakshi

రమణి(ఫైల్‌)

ప్యాపిలి : తమ కుమార్తెకు ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. మృత్యువు రూపంలో ఆమె వారికి దూరమై ఎనలేని విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన బాలక్రిష్ణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె రమణి (15) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఆమె కొంత కాలంగా రక్తహీనతతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తరచూ చికిత్స చేయిస్తున్నారు. బైపీసీ చదువుతున్న ఆమె శుక్రవారం వెలువడిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో  8.3 పాయింట్లు సాధించింది. కుటుంబ సభ్యులతో మిఠాయి పంచుకుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంది. అయితే శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడింది. ఒక రోజు ముందు ఆనందంగా గడిపిన తమ కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కళాశాల ప్రిన్సిపల్‌ రవీంద్రనాథ్‌ విద్యార్థిని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement