Bipc students
-
ఫలితాలు వచ్చిన మరుసటి రోజే..
ప్యాపిలి : తమ కుమార్తెకు ఇంటర్లో మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. మృత్యువు రూపంలో ఆమె వారికి దూరమై ఎనలేని విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన బాలక్రిష్ణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె రమణి (15) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆమె కొంత కాలంగా రక్తహీనతతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తరచూ చికిత్స చేయిస్తున్నారు. బైపీసీ చదువుతున్న ఆమె శుక్రవారం వెలువడిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 8.3 పాయింట్లు సాధించింది. కుటుంబ సభ్యులతో మిఠాయి పంచుకుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంది. అయితే శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడింది. ఒక రోజు ముందు ఆనందంగా గడిపిన తమ కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ విద్యార్థిని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
వైద్యవిద్యకు జాతీయ మార్గం...
డాక్టర్.. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకున్న ప్రతి విద్యార్థి కల.. ఇందుకోసం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే శ్రమిస్తుంటారు.. గతంతో పోలిస్తే మెడికల్ సీట్లు పెరగడం.. సిలబస్‌లో చెప్పుకోదగ్గ వ్యత్యాసం లేకపోవడంతో.. ఎంసెట్ నుంచి ఎయిమ్స్ ఎంట్రెన్స్ టెస్ట్ వరకు.. రాష్ర్టంతోపాటు జాతీయ స్థాయి వైద్య కళాశాల్లో సీటే లక్ష్యంగా సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఎందరో.. ఈ నేపథ్యంలో ఏయే పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? దృష్టిసారించాల్సిన అంశాలు? అనుసరించాల్సిన వ్యూహాలు? తదితరాలపై విశ్లేషణ.. సిలబస్ ఒకటే: ఇన్స్టిట్యూట్ ఏదైనా.. ప్రవేశ పరీక్షలోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుం ది. ప్రశ్నించే విధానం, క్లిష్టతలో మాత్రమే కొద్ది తేడాను గమనించవచ్చు. ఈ పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి. వీటితోపాటు మ్యాచ్ ది ఫాలోయింగ్, కరెక్ట్/ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, చూస్ ది ఆడ్ వన్ వంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. జనరల్ నాలెడ్జ్/జనరల్ ఎబిలిటీ/ఇంగ్లిష్: కొన్ని ఇన్స్టిట్యూట్లు మాత్రం అకడమిక్ సబ్జెక్టులతోపాటు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ వంటి విభాగాలపై కూడా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. అవి.. ఎయిమ్స్ ఎంట్రెన్స్‌లో జీకేపై 20 ప్రశ్నలు ఉంటాయి. సీఎంసీ-వెల్లూరు ప్రవేశ పరీక్ష.. రెండో పేపర్లో రీజనింగ్, ఇంగ్లిష్, కరెంట్ టాపిక్స్‌పై 120 ప్రశ్నలు ఉంటాయి. ఇవి వేగం, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించినవి. ఎంజీఐఎంఎస్-వార్థా ఇతర ఇన్స్టిట్యూట్లకు భిన్నంగా గాంధీ ఆలోచనలపై ప్రత్యేకంగా ఒక పేపర్‌నే కేటాయించింది. గాంధీ ఆలోచనలకు సంబంధించి అడిగే ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లో ఎస్సే/షార్ట్ ఆన్సర్స్ పద్ధతిలో సమాధానాలను రాయాలి. జిప్మర్లో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు. సులభమే: సబ్జెక్ట్‌లకు భిన్నంగా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ.. వాటి క్లిష్టత సులభంగానే ఉంటుంది. ఓ సాధారణ విద్యార్థి కూడా సమాధానాలు గుర్తించే విధంగా ఉంటాయి. కాబట్టి సంబంధిత మాక్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్‌పై పట్టు ఉంటే ఇంగ్లిష్‌లో చక్కని స్కోర్ చేయొచ్చు. ముఖ్యంగా కరక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ద ఎర్రర్, ప్యాసేజ్ కొశ్చన్స్ వంటి అంశాలు ఉంటాయి. దీని కోసం మార్కెట్లో దొరికే ఏదైనా ప్రామాణిక పుస్తకాన్ని చదవడం లాభిస్తుంది. జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే.. చరిత్ర, రాజ్యాంగం, స్వాతంత్య్రోద్యమం, తదితర అంశాలకు సంబంధించిన ప్రధాన ఘట్టాలపై క్షుణ్నమైన అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. ఇందుకోసం దినపత్రికలను, కాంపిటీటివ్ మ్యాగజీన్లను చదవాలి. జనరల్ ఆప్టిట్యూడ్ కోసం బ్యాంక్ పరీక్షలకు ఉయోగపడే పుస్తకాల అధ్యయనం మేలు. సబ్జెక్ట్‌ల వారీగా సిద్ధం ఇలా ఫిజిక్స్ ఎంసెట్, జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో మెరుగైన ర్యాంక్ సాధనలో ఫిజిక్స్ పాత్ర కీలకం. ఎంసెట్‌తో పోల్చితే జాతీయ స్థాయి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు సులువుగా ఉంటాయి. జాతీయ స్థాయి పరీక్షలో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ లేదు. కాబట్టి అన్ని పాఠ్యాంశాలను కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. {పథమ సంవత్సరంలో గతిశాస్త్రం, ఉష్ణం, ఉష్ణగతికశాస్త్రం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఉష్ణగతిక శాస్త్రంలో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో ద్వంద్వ స్వభావం, కాంతి విద్యుత్ ఫలితం, అర్ధ వాహకాలలోని ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా చదవాలి. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీని వల్ల పునశ్చరణ సులువవుతుంది. {పతి విభాగం నుంచి సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను అభ్యసించాలి. కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలి. -పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ ఎంసెట్‌తోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని రకాల మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు సమగ్ర ప్రిపరేషన్ సాగించాలి. కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పట్టు మెరుగైన మార్కులకు దోహదం చేస్తుంది. మొదటి ఏడాది నుంచి ఎన్సీఈఆర్టీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అంతేకాకుండా గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడంతోపాటు మాక్ టెస్ట్‌లు/మోడల్ టెస్ట్‌లకు తప్పకుండా హాజరు కావాలి. తద్వారా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. పరీక్షల్లో సమయపాలనపై అవగాహన కూడా ఏర్పడుతుంది. {పస్తుతం సాంకేతిక, ఆర్ అండ్ డీ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పరిశోధనలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయో మాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఆర్గానిక్ కెమిస్ట్రీపై దృష్టి సారించాలి. అన్ని నేమ్డ్ రియాక్షన్స్, వాటి వ్యవస్థలు (రీజెంట్స్తో కలిపి), ఇంటర్ కన్వర్షన్స్, ఆల్కహాల్-ఫినోల్స్-కార్బక్సిలిక్ యాసిడ్స్ ్కఓ్చ విలువలు, అమైన్స్ తదితరాల ్కఓఛ విలువలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫార్ములాలతో సంబంధం ఉండే సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హలైడ్స్, ఆక్సీ యాసిడ్స్ వంటి వాటి ప్రతి సమూహ లక్షణాలు, ఉపయోగకర సమ్మేళనాలు, తయారీ సంబంధిత అంశాలను ఎక్కువగా సాధన చేయాలి. పరీక్షల్లో విభిన్నమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అంశంపై అవగాహనతో ఉండడం ప్రయోజనకరం. కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వడం ఉత్తమం. -ప్రసాద్ రావు గర్లపాటి, సీనియర్ ఫ్యాకల్టీ. బోటనీ జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్షల విషయంలో సిలబస్‌కు సంబంధించి కొద్దిపాటి తేడా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులుండవు. బోటనీ విషయంలో సిలబస్ దాదాపుగా ఒక్కటే. కానీ యథాతథంగా ఉండదు. ఎందుకంటే ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నించే పద్ధతి, పరీక్ష విధానం వేర్వేరుగా ఉంటాయి. {పిపరేషన్లో యూనిట్లు/చాప్టర్ల వారీగా హాజరవుతున్న పరీక్షను దృష్టిలో ఉంచుకుని మోడల్ టెస్ట్ రాయడం ప్రయోజనకరం. తద్వారా పరీక్షా విధానం, ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పడుతుంది. ఏఐపీఎంటీ, కేఎంసీ వంటి పరీక్షల్లో డయాగ్రమ్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ అంశంపై కూడా దృష్టి సారించాలి. చిత్రాలను, భాగాలను గుర్తించడం వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఎయిమ్స్ వంటి పరీక్షల్లో అసెర్షన్-రీజనింగ్ వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం కీలకం. తద్వారా ఇటువంటి ప్రశ్నలకు తేలిగ్గా సమాధానం గుర్తించవచ్చు. కేఎంసీ మినహా మిగతా పరీక్షలన్నీ దాదాపుగా ఎం సెట్ తర్వాతే ఉంటాయి. కాబట్టి ఆయా పరీక్షల సిలబస్‌లో ఉండి, ఎంసెట్‌లో లేని అంశాలపై ఎంసెట్ పరీక్ష తర్వాత దృష్టి సారించడం ప్రయోజనకరం. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ. జువాలజీ గతంలో జాతీయ స్థాయి పరీక్షలకు మన సిలబస్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా జువాలజీ సిలబస్‌ను మార్చిన తర్వాత కొన్ని అంశాల సిలబస్ ఒకే విధంగా ఉందని చెప్పొచ్చు. పశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. సీనియర్ విద్యార్థులు మన సిలబస్‌కు అదనంగా జాతీయ స్థాయి పరీక్షల్లో అదనంగా ఉన్న అంశాలపై ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి దశ కోసం ప్రస్తుత సమయాన్ని కేటాయించాలి. తర్వాత ఐపీఈ, ఎంసెట్ కోసం సన్నాహాలు సాగించాలి. ఎంసెట్ తర్వాత జాతీయ స్థాయి పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాలి. జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని డయాగ్రమ్, అసెర్షన్-రీజనింగ్ ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. -కె.శ్రీనివాసులు, సీనియర్ ఫ్యాకల్టీ. గుర్తుంచుకోవాల్సినవి జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లు జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో సీబీఎస్ఈ సిలబస్‌కు మన సిలబస్‌కు మధ్య వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య అంతగా లేదు. కాబట్టి జాతీయ స్థాయి పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు. ఆయా పరీక్షలను అనుసరించి సబ్జెక్ట్‌లు కాకుండా అదనంగా ఉండే ఇంగ్లిష్, జీకే అంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుంది. సంబంధిత ఎంట్రెన్స్‌కు సంబంధించి సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది. ముఖ్య ఫార్ములాలు, కీలక పాయింట్లపై క్రమ పద్ధతిలో అవగాహన పెంచుకోవడం మంచిది. సెక్షన్ల వారీగా సమయ విభజన చేసుకోవాలి. విరామం, మైండ్ రిలాక్స్ కోసం 10 నిమిషాలు కేటాయించుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే ఈ ఎంట్రెన్స్లలో ఈ పద్ధతి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్గా ఉండే ప్రశ్నలను ముందు ఎంచుకోండి. వీటి పరిష్కారానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా విభాగాలను ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఇది ఉపకరిస్తుంది. రిఫరెన్స్ బుక్స్: సబ్జెక్ట్‌ల వారీగా ఎన్సీఈఆర్టీ 11,12 తరగతి పుస్తకాలు,చాంద్ పబ్లికేషన్స్,మల్హోత్ర పబ్లికేషన్స్. -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయమంత్రం!
‘డాక్టర్’ కెరీర్‌ను అందుకొని.. ఆపై సమాజంలో సమున్నత గౌరవం పొందాలన్నది ఎందరో విద్యార్థుల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. అత్యుత్తమ మార్కులతో దీన్ని విజయవంతంగా పూర్తిచేసి.. ఆపై ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వైద్యంతో పాటు మరెన్నో రంగాల్లో సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్, ఎంసెట్ వృక్షశాస్త్రంలో అత్యధిక మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్రణాళిక.. బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఎంసెట్ ఎంసెట్ (మెడిసిన్) రాయాలనుకునే విద్యార్థులు ప్రిపరేషన్‌కు ముందు కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం (Exam Pattern), ప్రశ్న రకాలు, మాదిరి ప్రశ్నలు లేదా ప్రీవియస్ పరీక్షల ప్రశ్నలు, పరీక్షకు నిర్దేశించిన సమయం, పరీక్ష తేదీ, ఏ పాఠ్యపుస్తకాలను చదవాలి? ఎంత సమయం కేటాయించాలి? వెయిటేజీ విధానం ఏమైనా ఉందా? తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్: ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియెట్ సిలబస్. పరీక్ష విధానం: బహుళైచ్ఛిక సమాధానాలు. నెగిటివ్ మార్కులుండవు. ప్రశ్నల రకాలు: బహుళైచ్ఛిక (Multiple Choice), బహుళ సమాధాన ప్రశ్నలు (Multiple Answers), జత పర్చడం (Match the Following), నిశ్చిత వ్యాఖ్య (Assertion & Reasoning). మాదిరి ప్రశ్నలు: ఈ ఏడాది వృక్షశాస్త్రం సిలబస్‌లో మార్పులు బాగా జరిగాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లలోని ప్రశ్నలు అంతగా ఉపయోగపడవు. అయితే వాటిద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన పెంపొందించుకోవచ్చు. పాఠ్యపుస్తకాలు:తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలి. వెయిటేజీ: ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం, ఎంసెట్‌కు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. ర్యాంకు నిర్ధరణకు వరుసగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ప్రాధాన్యత ఇస్తారు. పరీక్షకు సిద్ధంకావడానికి లెక్చరర్ సహాయం తీసుకోవాలి. సీనియర్ విద్యార్థులు, ర్యాంక్ సాధించిన వారి సలహాలను పాటించాలి. ఎంసెట్ ప్రశ్నపత్రంలో 1 నుంచి 40 వరకు ప్రశ్నలు వృక్షశాస్త్రానికి సంబంధించి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల కంటే ముందు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ఉత్తమం. సిలబస్ మారిన తర్వాత తొలిసారిగా ఎంసెట్-2014 జరగబోతోంది. వృక్షశాస్త్రానికి సంబంధించి వివిధ యూనిట్ల నుంచి ఈ కింది విధంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఇంటర్ ఫస్టియర్: యూనిట్ {పశ్నల సంఖ్య 1. జీవ ప్రపంచంలో వైవిధ్యం 3 లేదా 4 2. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం 6 3. మొక్కల్లో ప్రత్యుత్పత్తి 3 4. మొక్కల సిస్టమాటిక్స్ 2 లేదా 3 5. కణం- నిర్మాణం, విధులు 2 6. మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం 2 7. వృక్ష ఆవరణ శాస్త్రం 2 పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని క్షుణ్నంగా చదివిన తర్వాత మాదిరి ప్రశ్నపత్రానికి సమాధానాలు రాయడం ద్వారా ప్రిపరేషన్ పూర్తవుతుంది. ఇంటర్మీడియెట్ రెగ్యులర్ విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లోని యూనిట్ 1- జీవ ప్రపంచంలో వైవిధ్యం, యూనిట్ 4- మొక్కల సిస్టమాటిక్స్లను కలిపి చదివితే తేలిగ్గా ఉంటుంది. యూనిట్ 1 నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ యూనిట్లో కొన్ని విషయాలపై పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల అర్థం చేసుకోవడం కంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్ సహాయాన్ని తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది. యూనిట్ 4 విషయంలో మొక్కల కుటుంబాల గురించి అవగాహన కంటే వాటికి సంబంధించిన అంశాలను చదివి గుర్తుంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. యూనిట్ 2- మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం చాలా సులభంగా ఉండే పాఠ్యాంశం. దీన్ని చదివేందుకు తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ మార్కులు సాధించవచ్చు. యూనిట్ 3 (మొక్కల్లో ప్రత్యుత్పత్తి)పై అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. అందువల్ల ఇందులోని అంశాలను ఒకటికి రెండుసార్లు బాగా చదవాలి. సెకండియర్: యూనిట్ {పశ్నల సంఖ్య 1.వృక్ష శరీర ధర్మశాస్త్రం 6 లేదా 8 2.సూక్ష్మజీవ శాస్త్రం 2 3.జన్యుశాస్త్రం 2 4.అణుజీవ శాస్త్రం 3 5.జీవ సాంకేతిక శాస్త్రం 2 లేదా 3 6.మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మ జీవులు 3 లేదా 4 ఇంటర్ సెకండియర్ వృక్షశాస్త్రం పాఠ్యాంశాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఏ విషయంపైనా పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పాఠంలో కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుంది అని ఉంటుంది. మరో పాఠం శ్వాసక్రియలో ‘కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన సుక్రోజ్’ అని ఉంటుంది. వాస్తవానికి మొక్కల్లో గ్లూకోజ్ ఏర్పడదు. యూనిట్ 1లో ఆరు పాఠ్యాంశాలుంటాయి. ఒక్కో అంశం నుంచి ఒక్కో ప్రశ్న ఎంసెట్‌లో వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఈ యూనిట్‌ను వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. యూనిట్ 4లోని క్లిష్టమైన పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు లెక్చరర్ సహాయం తప్పనిసరి. ఈూఅ నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఇచ్చే అవకాశముంది. అందువల్ల వీలైనన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. యూనిట్ 2, యూనిట్ 4లను కలిపి చదివితే ప్రయోజనం ఉంటుంది. ఈ యూనిట్ల నుంచి ఐదారు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. సూక్ష్మజీవుల పేర్లు, మొక్కల వంగడాల పేర్లు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎంసెట్‌కు రెండు రోజుల ముందు వీటిని రివిజన్ చేస్తే ఫలితం ఉంటుంది. లాంగ్‌టర్మ్ విద్యార్థులకు: గత సిలబస్‌తో పోలిస్తే ప్రస్తుత సిలబస్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి లాంగ్‌టర్మ్ విద్యార్థులు కొంత ఎక్కువ కష్టపడక తప్పదు. గత సిలబస్‌తో పోలిస్తే మొదటి సంవత్సరం యూనిట్ 1 పూర్తిగా భిన్నమైంది. అందువల్ల దీనిపై ఎక్కువ శ్రద్ధచూపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పుస్తకాలను చదవకూడదు. సెకండియర్ నుంచి వచ్చే ప్రశ్నలకు లాంగ్‌టర్మ్ విద్యార్థులు ఎక్కువగా యూనిట్ 4 (అణుజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. వృక్షశాస్త్రంలో ఎక్కువగా చేసే తప్పుల్లో తెలియక తప్పుచేసినవి మూడు శాతం ఉంటే, తెలిసి కూడా తప్పుచేసినవి 10 శాతం ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. లాంగ్‌టర్మ్ విద్యార్థులు మొదటి సంవత్సరం యూనిట్ 1లోని రెండో పాఠం (జీవశాస్త్ర వర్గీకరణ), ద్వితీయ సంవత్సరం యూనిట్ 2 (సూక్ష్మజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఇలా చేస్తే సమయం చాలా ఆదా అవుతుంది. ఇంటర్ పరీక్షలు ఫస్టియర్ బోటనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో బోటనీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే తొలుత సిలబస్‌లోని పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకొని తర్వాత విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ప్రధానం. ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠ్యాంశాలపై దృష్టిసారించాలి. ప్రశ్నపత్రంపై అవగాహన: పేపర్ మొత్తం 76 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇందులో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఏలో 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్ సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండింటికి సమాధానం రాయాలి. పాఠ్యాంశాలు- వెయిటేజ్: యూనిట్ 1:జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు) యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు) యూనిట్ 3:మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు) యూనిట్ 4:ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు) యూనిట్ 5:కణ నిర్మాణం, విధులు (14 మార్కులు) యూనిట్ 6:మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు) యూనిట్ 7:వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు) 2, 3, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మొదటి నుంచి చేతిరాతను మెరుగుపరచుకోవాలి. సెకండియర్ బోటనీ: ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి సంవత్సర వార్షిక పరీక్షల అనుభవాన్ని విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ పాఠ్యాంశాలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్‌ను సంప్రదించి, అతని సలహాలను పాటించడం చాలా ముఖ్యం. వెయిటేజీకి తగ్గట్టు సన్నద్ధం: యూనిట్ 1:మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు) యూనిట్ 2:సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు) యూనిట్ 3:జన్యుశాస్త్రం (6 మార్కులు) యూనిట్ 4:అణు జీవశాస్త్రం (8 మార్కులు) యూనిట్ 5:బయోటెక్నాలజీ (16 మార్కులు) యూనిట్ 6:ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు) 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.