
రాయచూరు రూరల్: భర్త వేధింపులను భరించలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. నవోదయ దంత వైద్య కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న శృతి (26) సోమవారం రాత్రి హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని మహిళా పీఎస్ సీఐ గుండూరావ్ తెలిపారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శృతికి గతేడాది డిసెంబర్‌లో పెళ్లయింది. భర్త బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. లాక్‌డౌన్ కావడంతో సొంతూరులో ఇంటి నుంచి పనిలో ఉన్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శృతి బాధపడేది. దీంతో జీవితం మీద విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment