ఫీజులు చెల్లించలేదని పిల్లలను ఇళ్లకు పంపారు | the children were sent home, fee due | Sakshi
Sakshi News home page

ఫీజులు చెల్లించలేదని పిల్లలను ఇళ్లకు పంపారు

Published Wed, Feb 12 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజులు చెల్లించలేదని పిల్లలను ఇళ్లకు పంపారు - Sakshi

ఫీజులు చెల్లించలేదని పిల్లలను ఇళ్లకు పంపారు

 రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ :ఫీజు చెల్లించలేదని పిల్లలకు ఇంటికి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరంలోని భగవాన్ మహావీర్ పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ సఫాయి కర్మచార ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు.


   ఈమేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం జిల్లాధికారి కలెక్టరేట్ వద్ద వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఫీజులు చెల్లించలేదని చెబుతూ భగవాన్ మహావీర్ పాఠశాల నిర్వాహకులు సఫాయి కర్మచార ఉద్యోగుల పిల్లలను ఇంటికి పంపుతున్నారన్నారు. ఫీజు చెల్లింపునకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరినా పాఠశాల యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. దాదాపు ఉదయం ప్రారంభించిన ధర్నాను రాత్రి 7.30గంటల వరకు కొనసాగించారు. డీఈఓ మల్లికార్జున అక్కడకు చేరుకొని వారితో చర్చించారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘం సంచాలకులు భాస్కర్‌బాబు, గీత పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement