మహిళా రైతుపై దాడి చేస్తున్న ఎస్‌ఐ
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఎస్‌ఐ దాష్టీకానికి పాల్పడ్డారు. విత్తనాల కోసం వచ్చిన మహిళపై చేయిచేసుకుకొని దురుసుగా వ్యవహరించారు. ఈఘటన గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో చోటు చేసుకుంది. గురుమఠకల్‌లో గురువారం విత్తన పంపిణీ చేపట్టారు. దీంతో గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి క్యూలో నిలబడ్డారు.
చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
ఈ సందర్భంగా తోపులాట జరిగింది. దీంతో బందోబస్తు కోసం వచ్చిన ఎస్‌ఐ గంగమ్మ ఒక మహిళను కిందకు తోసి ఆమెపై చేయి చేసుకుంది. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా ఘటనపై విచారణ చేపడుతామని జిల్లా ఎస్పీ వేదమూర్తి ప్రకటించారు.
చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ..
Comments
Please login to add a commentAdd a comment