సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య | Pregnant Woman Suicide in Raichur Rural | Sakshi
Sakshi News home page

సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య

Published Mon, Oct 11 2021 7:13 AM | Last Updated on Mon, Oct 11 2021 7:13 AM

Pregnant Woman Suicide in Raichur Rural - Sakshi

నిర్మల (ఫైల్‌) 

సాక్షి, రాయచూరు రూరల్‌: వరకట్న వేధింపులకు మరో అబల బలైంది. గదగ్‌ జిల్లాలో గర్భిణి అత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... గదగ్‌ జిల్లా గజేంద్ర గడకడ్డికి చెందిన లోకేష్‌ రాథోడ్‌ (27)కు ఏడాది క్రితం బాగల్‌కోట జిల్లా ఇలకల్‌ తాలూకా చిక్క కోడలగి తండాకు చెందిన నిర్మల (23)తో వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో అనుకున్నంత వరకట్నం తేలేదని నిర్మలను రోజూ చిత్రహింసలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది భరించలేక శుక్రవారం రాత్రి  నిర్మల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల గర్భిణి కావడంతో ఆమె సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఈ దుర్ఘటన జరగడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. గజేంద్ర గడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement