పీలేరు(విశాఖపట్నం) : వడదెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా ఓ మహిళ వడదెబ్బకు గురై మృతిచెందింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మరణించిన సంఘటన విశాఖ జిల్లా పీలేరులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రమాదేవి(25) అనే మహిళ పీలేరు నుంచి హైదరాబాదుకు ఆర్టీసీ బస్సులో వెళుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమెకు వడదెబ్బ తగిలింది. వడదెబ్బ తగిలిన ఆమె అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె చనిపోయింది. మృతురాలు రమాదేవి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా చింతలపాడు మండలం మోతుగూడెం అని తెలుస్తోంది.