కరీంనగర్ (ఇల్లంత కుంట): వడదెబ్బకు ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లంత కుంట మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన వజ్రవ్వ (45) పనుల నిమిత్తం బుధవారం పొలానికి వెళ్లింది. అయితే ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వజ్రవ్వను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే పరిస్థితి నిలకడగా ఉండటంతో రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, నలుగురు కుమార్తెలు ఉన్నారు.