మహబూబ్‌నగర్ : వడదెబ్బ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వేళ్తే... మరికల్‌కు చెందిన బొడి కిష్టమ్మ(55) అనే మహిళ గత నాలుగు రోజుల క్రితం వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానిక ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. కానీ వడదెబ్బ ప్రభావం తగ్గకపోవడంతో మంగళవారం ఇంట్లోనే మృతి చెందింది మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.