మిర్యాలగూడ(నల్లగొండ ): ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని శ్రీనివాస్నగర్ కాలనీలో ఉన్న మోడల్ స్కూల్ ఎదుట మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన లక్ష్మి(40) ప్రమాదవశాత్తూ జారి పడింది. దీంతో బస్సు వెనక టైర్లు ఆమె తలపై నుంచి వెళ్లడంతో,. అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.