గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి | Woman died in Hit and run case in khammam District | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి

Published Tue, Aug 11 2015 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

Woman died in Hit and run case in khammam District

ఖమ్మం : గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం ఖమ్మం రూరల్ మండలం నాయుడిపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఆరేకొడూ గ్రామానికి చెందిన లక్ష్మీ(50) అనే మహిళను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది.

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement