
సాక్షి, కడప : నేడు అక్కడక్కడ మొబైల్ పేలి మృత్యువాత పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి సంఘటన వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కల్లూరి పల్లె తండాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. బుక్కే శాంతమ్మ తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టింది. కాసేపు తర్వాత ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన శాంతమ్మ అక్కడిక్కడే మృతి చెందింది.
ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె అక్క కుమారుడు ఈశ్వర్ నాయక్ హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. బంధువులకు సమాచారం అందించే క్రమంలో నాయక్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె మరణవార్త విని ఈశ్వర్ నాయక్ కూడా మృతి చెందాడు.