![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/30/Woman%20died.jpg.webp?itok=EUC6tmG_)
హైదరాబాద్: ఇంట్లో కూలర్‌లో నీళ్లు పోస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ రిసాలబజార్‌లో హర్షియాబేగం(29) తన భర్త మహ్మద్‌తో కలిసి ఉంటున్నది. ఆదివారం రాత్రి కూలర్‌ను ఆఫ్ చేయకుండా నీళ్లు పోసింది. అదే సమయంలో ఆమె కూలర్ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను కాపాడబోయిన మహ్మద్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. కాగా కూలర్ ఐరన్‌ది కావడంతో అందులోకి విద్యుత్ ప్రవహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment