
ఈ చిత్రంలో ఉన్న ఈమె పేరు ఉప్పేమరియమ్మ(51). కుటుంబపోషణ నిమిత్తం 18 నెలలకిత్రం సౌదీ వెళ్లింది. అయితే మొదట్లో కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడేది. తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయింది. చివరికి గుండెపోటుతో మరణించినట్టు బంధువులకు సమాచారం అందింది. అయితే దుబాయ్‌లో తెలుగుప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన తెలుగుసేవా సమితి కృషితో ఎట్టకేలకు ఆమె మృతదేహం స్వగ్రామం వీరన్న మెరక ప్రాంతానికి చేరింది.
–అల్లవరం(అమలాపురం)